ప్రజామలుపు PRAJA MALUPU ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి - మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి

- మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు, డిసెంబర్ 18 (ప్రజా మలుపు):

ఎవరైనా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలపై అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహశీల్దార్ కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారం, ముత్తంగి సర్పంచులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని సమావేశానికి వచ్చిన ఎంఆర్ఓ కు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బి.సుప్రజా వెంకట్ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు సిల్వర్ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ లు నీలం మధు ముదిరాజ్, సుధీర్ రెడ్డి, ఉపేందర్, అంతిరెడ్డి గారి ధరణి అంతిరెడ్డి, గడ్డం బాలమణి శ్రీశైలం, పోచయ్య, పెంటయ్య, ఎంపీటీసీలు గడీల కుమార్ గౌడ్, గడ్డం శ్రీశైలం, మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, మాధవి నరేందర్ రెడ్డి, నీనా చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిడిఓ అనంత్ రెడ్డి, ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి, ఎంఈఓ పి.పి రాథోడ్, కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image
ప్రజామలుపు PRAJA MALUPU మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామ్ ... మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 
Image
ప్రజా మలుపు PRAJA MALUPU జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
Image
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image
ప్రజామలుపు PRAJA MALUPU గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు  - హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు  - క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ 
Image