మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామ్ ... మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
(దుండిగల్, ప్రజామలుపు, డిసెంబర్ 18) :
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామని మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు . రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తేది 22 డిసెంబర్ నాడు మున్సిపల్ ఎన్నికల సమావేశాలు కుత్బుల్లాపూర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించబోతున్న తరుణంలో ముఖ్య నాయకుల సమావేశం దుండిగల్ గండి మైసమ్మ వద్ద, షామీర్పేట్ లో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొసం పాటు పడాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు.