ప్రజామలుపు PRAJA MALUPU గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు  - హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు  - క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ 
గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు 

- హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు 

- క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ

పటాన్‌చెరు, డిసెంబర్ 17 (ప్రజా మలుపు):

హైదరాబాద్‌లోని గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం క్రిస్మస్ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు, శోభయమానంగా బెలూన్ల అలంకరణ, చావడిలో క్రీస్తు జననం వంటి దృశ్యాలతో పాటు క్రిస్మస్ గీతాలతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక గీతాలకు చక్కని వాద్య సహకారం కిన్నెర ఆడిటోరియాన్ని రసరమ్యంగా మార్చివేసింది. క్రిస్మస్ ముందస్తు వేడుకలను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ప్రారంభించగా, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మనస్తత్వవేత్త (సైకాలజిస్ట్) డాక్టర్ అషర్ ఆండ్రూ ఆతిథ్య ఉపన్యాసకుడిగా పాల్గొని క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. కొద్ది సేపు వైఫై సిగ్నల్స్ లేకపోతే వాటిని పొందేవరకు తపించిపోయే మనం భగవంతునితో నిత్య అనుసంధానం కలిగి ఉండాలని సూచించారు. ఏసుప్రభు భక్తుల పాపాల పరిహారార్థం శిలువపై రక్తాన్ని చిందించారని, ఆ సందేశం, స్పూర్తిలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాలన్నారు. ఏసు క్రీస్తును భౌతికంగా హింసించడం, శిలువ వేయడం, అప్పుడు జరిగిన శారీరక హింస వంటి దృశ్యాలన్నింటి వీడియోలను విద్యార్థులకు ప్రదర్శించారు. చివరగా డాక్టర్ ఆండ్రూ అందరితో క్రిస్మస్ ప్రార్థన చేయించారు. ఓ విద్యార్థి గిటార్తో భక్తిగీతాలు ఆలపించగా, తన్మయులైన కొందరు విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా, లయబద్దంగా కదులుతూ, రెండు చేతులతో చప్పట్లు కొడుతూ, నృత్యాలు చేస్తూ, వంత పాడుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. క్రిస్మస్ తాత శాంతాక్లాజ్ చేతి సంచిలోని బహుమతులను పంచుతూ, హాలంతా కలియ తిరుగుతూ, మధ్య మధ్యలో నృత్యాలు చేస్తూ విద్యార్థులందరిలో ఉత్సాహాన్ని నింపారు. చివరగా వేడుకలలో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు, శీతల పానీయాలు, నీళ్ళ సీసాలతో కూడి కిట్లను పంచిపెట్టారు. మొత్తం ప్రాంగణమంతా క్రిస్మస్ గీతాల ప్రతిధ్వనితో మార్మోగిపోయింది.

Popular posts
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image
ప్రజామలుపు PRAJA MALUPU మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామ్ ... మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 
Image
ప్రజా మలుపు PRAJA MALUPU జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
Image
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image