జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
(గద్వాల, ప్రజామలుపు, డిసెంబర్ 18) :
జోగుళాంబ గద్వాల జిల్లాకు క్రమం తప్పకుండా అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలులో పురోభివృద్ధి సాధించే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు . బుధవారం ఉదయం కలెక్టరేటు కార్యాలయములో సిటీసిపై సంతకాలు చేసి జిల్లా కలెక్టరుగా ఇంచార్జీ పదవీ బాధ్యతలు స్వీకరించగా జిల్లా సంయుక్త కలెక్టర్ జె . నిరంజన్ , అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష , ఆర్డిఓ రాములు కలెక్టరును పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు క్రమం తప్పకుండా రావటం జరుగుతుందని , సమీక్షా సమావేశాల ద్వారా అధికారులకు దిశా నిర్దేశము చేసిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా తమ నిధులను నిబద్ధతతో నిర్వహించాల్సి ఉంటుందని ఆదేశించారు .