హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లో జూనియర్ కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్
(కుత్బుల్లాపూర్, ప్రజామలుపు, డిసెంబర్ 18) :
జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లో కేటాయించిన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు సరిపోకపోవడంతో 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లోకి మార్చినట్లు కళాశాల ఉపాధ్యాయులు అన్నారు. ప్రస్తుతం హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లో మైదానంతో పాటు, ప్రశాంత వాతావరణం ఉండటంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదవాలని ఎమ్మెల్యే అన్నారు. మరే ఇతర మౌలిక వసతులకైనా ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో 128 చింతల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, నాయకులు సురేష్ రెడ్డి, మన్నె రాజు, వేణు యాదవ్, వెలుగు నారాయణ రావు మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.